‘ఆర్ఆర్ఆర్’ లో నటించిన ప్రతి ఒక్కరు ఇప్పుడు డబుల్ జోష్ లో ఉన్నారు. ఆల్రెడీ నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకొచ్చిన ఆనందంలో ఉన్నారు. మరోవైపు తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. నార్త్ నుంచి ఈ సినిమాలో నటించిన అజయ్ దేవగన్ కూడా తన ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఆయన నటించిన సినిమా భోళ. ఈ సినిమా ఈనెల 30న విడుదల కానుంది. తమిళంలో లోకేష్ కనగరాజ్ తెరకెకకించిన సినిమా ఖైదీ. కార్తి హీరోగా నటించిన ఈ సినిమా డార్క్ థ్రిల్లర్‌గా పలువురి మెప్పు పొందింది. తండ్రి కూతుర్ల మధ్య ఉన్న అనుబంధాన్ని చక్కగా చాటే ప్రయత్నం చేశారు లోకేష్.
ఈ కథకు మరికొన్ని విషయాలను అదనంగా జోడిస్తూ హిందీలో భోళ పేరుతో తెరకెక్కించారు అజయ్ దేవగన్. ఆయనే డైరెక్షన్ కూడా చేశారు. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్గా ఈ సినిమాని తెరికెక్కించారు. ఈ చిత్రంలో టబు చేత యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చేయించారు అజయ్ దేవగన్. సినిమా తప్పకుండా ఆడియన్స్ ని మెప్పిస్తుందని నమ్ముతున్నారు అజయ్ దేవగన్. భోళ సినిమా సౌత్ లో చూసిన వాళ్లు ఈ సినిమాను చూస్తే మరింత ఫ్రెష్ గా ఫీల్ అవుతారు అన్నది కూడా అజయ్ దేవగన్ చెప్తున్న మాట. ఈ స్పెషల్ ట్రీట్ కోసం అందరినీ రెడీగా ఉండమంటూ ఊరిస్తున్నారు అజయ్.
ఈ 30వ తేదీ భోళతో మాత్రమే కాదు, మరో ఇంటరెస్టింగ్ విషయంతో ఆడియన్స్ కి ట్రీట్ ఇవ్వనున్నారు అజయ్ దేవగన్. ట్రూ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన మైదాన్ సినిమా టీజర్ ను కూడా ఆయన భోళతో కలిపి విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు .అమిత్ రవీందర్ నాథ్ శర్మ దర్శకత్వం వహించిన సినిమా మైదాన్ . ప్రియమణి కీలక పాత్ర పోషించారు. గజరాజు రావు కూడా కీలకపాత్రలో కనిపిస్తారు. జి స్టూడియోస్ , బోనీకపూర్, అరుణ వాజ్ యంగ్ గుప్తా, ఆకాష్ చావ్లా ప్రొడ్యూస్ చేసిన సినిమా ఇది, శైవాన్ కాద్రాస్, రితేష్ షా డైలాగ్స్ రాశారు. రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాను జూన్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ మెప్పు పొంది తీరుతాయని కాన్ఫిడెంట్ గా ఉన్నారు అజయ్ దేవగన్. ఈ విషయం గురించి కాజోల్ కూడా ఇటీవల మాట్లాడారు. అజయ్ పనితీరుని ప్రేక్షకులు మెచ్చుకొని తీరుతానని తన తరఫునుంచి శుభాకాంక్షలు చెప్పారు కాజోల్.